Transco Ready to meet KLIS Power demand

(Judicial Quest News Service)

మేడిగడ్డ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలను కొద్ది
రోజుల్లోనే అటు శ్రీరారం సాగర్ ప్రాజెక్టుకు, ఇటు
మల్లన్నసాగర్ కు తరలించేందుకు అవసరమైన అత్యద్ధిక సామర్థ్యం
కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నట్లు జెన్కో – ట్రాన్స్ కో సిఎం
డి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఇందుకు అవసరమైన
విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు, పంపులు నిర్విరామంగా
నడవడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు
చెప్పారు. మొత్తం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత
కీలకమైన రామడుగు పంపు హౌజ్ ను ప్రభాకర్ రావు శనివారం
సందర్శించారు. ప్రపంచంలో మరెక్కడా వాడనంత అత్యధిక
సామర్థ్యంతో రామడుగులోనే పంపులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి
139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 పంపులను (మొత్తం 973
మెగావాట్లు) రామడుగులో ఏర్పాటు చేశారు. ఈ పంపులను ప్రభాకర్
రావు శనివారం తనిఖీ చేశారు. కన్నెపల్లి నుంచి అన్నారంకి చేరిన
గోదావరి నీరు అక్కడి నుండి ప్రస్తుతం సుందిళ్లకు వస్తున్నది.
సుందిళ్ల నుండి ఎల్లంపల్లికి చేరుకుంటుంది. ఆ తరువాత నందిమేడారం
ద్వారా రామడుగుకు వస్తుంది. రామడుగు తరువాత గోదావరి నీటిని దాదాపు
100 మీటర్లకు పైగా ఎత్తిపోసి రెండు వేర్వేరు రెగ్యులేటర్ల
ద్వారా అటు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఇటు మిడ్ మానేరుకు నీటిని
పంపుతారు. మొత్తం ప్రాజెక్టులో ఈ ప్రక్రియే అత్యంత
కీలకమైనది కావడంతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా విద్యుత్ శాఖ
ఏర్పాట్లు చేసింది. త్వరలోనే రామడుగు దాకా నీళ్లు వచ్చే అవకాశం
ఉండడంతో లిఫ్టింగుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభాకర్ రావు తనిఖీ
చేశారు. మొత్తం 7 పంపుల్లో 5 ఇప్పటికే పంపింగ్ కు సిద్ధంగా
ఉన్నాయి. మరో రెండు పంపులు కూడా త్వరలోనే సిద్ధం అవుతాయి.
అత్యధిక సమార్థ్యం కలిగిన పంపులు వాడుతున్నందున విద్యుత్
సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగకుండా రామడుగులోనే 400 కె.వి
సామర్థ్యం కలిగిన డెడికేటెడ్ సబ్ స్టేషన్ ను నిర్మించారు. ఆ
సబ్ స్టేషన్ ను కూడా ప్రభాకర్ రావు సందర్శించారు. విద్యుత్ శాఖ
చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ క్షణాన
గోదావరి నీళ్లు రామడుగు చేరుకున్నా మరు క్షణమే ఎగువకు
ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

‘‘ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలో మరెక్కడా
లేది విధంగా 500 మీటర్లకు పైగా నీటిని ఎత్తిపోసేందుకు వివిధ
దశల్లో పంపులు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్
మార్గదర్శకత్వంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అత్యంత
ముఖ్యమైన లిఫ్టింగ్ పనులను ట్రాన్స్ కో ద్వారా చేపట్టాం.
ఇంత పెద్ద లిఫ్టులను నడిపిన చరిత్ర గానీ, అనుభం గానీ ప్రపంచంలో
మరే విద్యుత్ సంస్థకూ లేదు. ఆ ఘనతను తెలంగాణ ట్రాన్స్ కో
దక్కించుకుంది. 4,700 మెగావాట్లకు పైగా విద్యుత్ చ్ఛక్తిని
ఉపయోగించి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 45 లక్షల ఎకరాలను
సస్యశామలం చేసే భగీరథ ప్రయత్నం ఇది. వివిధ దశల్లో, వివిధ
ఎత్తుల్లో, నీటి ప్రవాహ ఉదృత్ కి అనుగుణంగా అత్యంత
శాస్త్రీయమైన పద్దతిలో లిఫ్టులను ఏర్పాటు చేశాం. రామడుగు
వద్ద ఏర్పాటు చేసిన పంపులు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ
సమార్థ్యం కలిగినవి. కన్నెపల్లి వద్ద 11, అన్నారం వద్ద 8,
సుందిళ్ల వద్ద 9, నందిమేడారం వద్ద 7, తిప్పాపూర్ వద్ద 4,
చంద్లాపూర్ వద్ద 4 పంపులు ఏర్పాటు చేశాం. గోదావరి నీళ్లు
ప్రస్తుతం సుందిళ్ల చేరుకుంటున్నాయి. త్వరలోనే ఎల్లంపల్లి,
నందిమేడారం ద్వారా రామడుగు వస్తాయి. అక్కడి నుండి శ్రీరారం
సాగర్ ప్రాజెక్టుకు, మిడ్ మానేరుకు నీటి పంపింగ్ జరుగుతుంది. మిడ్
మానేరు ద్వారా తిప్పాపూర్, చంద్లాపూర్, తుక్కూపూర్ మీదుగా
మళ్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడానికి
అవసరమైన పంపులను దానికి కావాల్సిన విద్యుత్ సరఫరా ఏర్పాట్లను
పూర్తి చేశాం’’ అని ప్రభాకర్ రావు చెప్పారు.
ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లతోనే సంతృప్తి పడకుండా నీటి
లిఫ్టింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండి సమర్థ నిర్వాహణ
ద్వారా ఎత్తిపోతల పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను
కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *